Healthhealth tips in telugu

పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఏమి అవుతుందో తెలుసా?

Benefits of keeping Pillow under Legs : మనలో కొంత మంది పాదాల కింద దిండు పెట్టుకొని పడుకుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. .
sleeping problems in telugu
ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదు. సరిగా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే గర్భధారణ సమయంలో కూడా పాదాల కింద దిండు పెట్టుకొని పడుకోమని డాక్టర్ సూచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే గర్భదరణ సమయంలో పాదాల వాపు మరియు నీరు పట్టటం వంటి సమస్యలు వస్తాయి.

ఆ సమస్యలు రాకుండా ఉండాలన్న, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా పాదాల కింద దిండు పెట్టుకోవాలి. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే…ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రోజంతా ఎక్కువగా పని చేసినప్పుడు ఒక్కోసారి పాదాల వాపు వస్తుంది.

రాత్రి పడుకునే ముందు కాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకుంటే కాళ్ళ వాపు తగ్గుతుంది. అలాగే వెరికోస్ వెయిన్స్ అతిగా శ్రమ పడటం వలన వచ్చే కండరాల్లో వాపు కూడా తగ్గుతుంది. కొంతమంది అలసటను పట్టించుకోకుండా ఎక్కువగా పని చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కోసారి వెన్ను నొప్పి .కూడా వస్తుంది. అలా వెన్నునొప్పి ఉన్నవారు కూడా రాత్రి పడుకునే ముందు పాదాల కింద దిండు వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది.
thigh pain
అలాగే కంప్యూటర్ మీద ఎక్కువ పని చేయటం వల్ల కొంతమందికి సయాటికా నొప్పి, డిస్క్ నొప్పి కూడా వస్తుంది. ఈ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలో ఏమైనా లోపాలు ఉన్నా పాదాల కింద దిండు పెట్టుకొని పడుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడి కాళ్ళ నొప్పులు, కాళ్లలో మంట వంటివి తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.