Healthhealth tips in telugu

పెరుగు అన్నంలో మామిడి పండు తింటున్నారా… శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Mango And Curd Rice :మామిడి పండు అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఎక్కువగా తింటే వేడి చేస్తుందని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. మన పెద్దవారు మామిడి పండ్లను పెరుగు అన్నంలో కలిపి తింటే మంచిదని చెప్పేవారు. దానిలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
Mango And Curd Rice
పూర్వకాలంలో అందరికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. పనులు అన్నీ చేసుకుని తొందరగా పడుకునేవారు. ఎక్కువ శ్రమ పడేవారికి ఎక్కువ శక్తి అవసరం. కాబట్టి పెరుగు అన్నంలో మామిడి పండు కలిపి తింటే శక్తి ఎక్కువగా వస్తుందని అలా తినేవారు.
mango
మామిడి పండులో విటమిన్ సి ఫైబర్,పెక్టిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. చర్మం లోపలి నుండి శుభ్రం చేసి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగు పరచడానికి సహాయపడి కళ్ళు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.