ఈ హీరోలు కెరీర్ లో ఎదగలేకపోవటానికి కారణం ఎవరో తెలుసా? నమ్మలేని నిజం

Tollywood Heroes DownFall:అన్ని రంగాల్లో మాదిరిగా సినీ రంగంలో కూడా వారసుల జోరు పెరుగుతూనే ఉంది. ఒక్కో ఫామిలీ నుంచి ఎక్కువమందే నటులు వస్తున్నా అందులో కొందరే సక్సెస్ అవుతున్నారు. కొందరు ఎందుకో వెనక్కి వెళ్లిపోతున్నారు. నటన వచ్చినా కూడా కొందరు దూరం జరిగిపోతున్నారు. ఇందుకు వాళ్ళ తండ్రులు కూడా కొంత కారణం అని విమర్శకులు అంటున్నారు.

మర్రి చెట్టుకింద మరో మొక్క మొలవదన్న చందంగా పరిస్థితి తయారైంది అంటున్నారు. అలాంటి వాళ్లెవరో ఓసారి చూద్దాం. ముందుగా చెప్పుకోదగ్గ వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ అనాలి. ఈయన కొడుకు హరికృష్ణ సక్సెస్ కాలేదు. తండ్రి అభ్యంతరాల వలన కొంత, వ్యక్తిగత కారణాల వలన మరికొంత నష్టపోయి మొత్తానికి సక్సెస్ అందుకోలేకపోయారు.

అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నాగార్జున ఎంతో ఎదిగాడు. అయితే ఆ విజయ రహస్యాన్ని కొడుకు నాగ చైతన్యకు నాగార్జున అందించలేకపోయాడని చెప్పాలి. మంచి నటన ఉన్నప్పటికీ నాగేశ్వరరావు,నాగార్జునలతో పోలిక తెచ్చేసరికి నాగ చైతన్య తేలిపోతున్నాడని చెప్పాలి.
Allu Sirish Unknown facts
అదే విధంగా అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ కి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎందుచేతనో ఎదగడం లేదు. బన్నీతో పోల్చి చూస్తే శిరీష్ కి సినిమా ఛాన్స్ లు కష్టమే అని అంటున్నారు .
manchu vishnu
ఇక మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు కూడా ఎందుకో క్లిక్ అవ్వలేదు. నటన పరంగా విష్ణు ,మనోజ్ లు భేషుగ్గా ఉన్నప్పటికీ ఎందుకో తండ్రితో పోలిస్తే అసలు రాణించలేకపోతున్నారు.

అదే తరహాలో హిందీలో కూడా అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ లను చూస్తే అర్ధం అవుతుంది. ప్రతిదానికి అమితాబ్ బచ్చన్ తో పోల్చడం వలన బిగ్ బి ముందు అభిషేక్ ని స్మాల్ బి గా ఉంచేశారు. ఏం చేసినా అమితాబ్ రేంజ్ లో నడవాలంటే కష్టం కదా మరి. ఎవరి రేంజ్ వాళ్లదని భావిస్తే ఎదుగుదల ఉంటుంది. లేకుంటే కనుమరుగు అవ్వక తప్పదని అభిషేక్ విషయంలో తేలిపోయింది.