Healthhealth tips in telugu

ఏ పండుని ఏ సమయంలో తినాలో తెలుసా… మిస్ కాకుండా చూడండి

Fruits eating best time: మనలో చాలా మంది పండును తినడానికి చాలా ఇష్టపడతారు. కొంతమంది పండ్లు తినడానికి ఇష్టపడరు.పండ్లు తినడానికి కూడా ఒక సమయం ఉంటుందని మీకు తెలుసా. పండు తింటే ఆరోగ్యానికి మంచిదని వీలు ఉన్నప్పుడు పండ్లను తింటూ ఉంటారు. పండ్లు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ పండు ని ఏ సమయంలో తింటే మంచిదో తెలుసుకుందాం.
apple
ఆపిల్
ఆపిల్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాపిల్లో పీచు ఎక్కువగా ఉండటం వలన ఉదయం సమయంలో మాత్రమే తినాలి. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తింటే జీర్ణక్రియకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి యాపిల్ని ఉదయం తినటానికి ప్రయత్నం చేయండి.

పుచ్చకాయ
నీరు అధికంగా ఉన్న పుచ్చకాయను పగటి సమయంలో మాత్రమే తినాలి. రాత్రి సమయంలో తింటే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళాల్సి వస్తుంది. దాంతో నిద్ర సరిగా ఉండదు.కాబట్టి పుచ్చకాయను సాధ్యమైనంత వరకు పగటి సమయంలో తినటానికి ప్రయత్నం చేయండి.
Gauva fruits
జామకాయ
జామకాయలు పోషకాలు అధికంగా ఉండటం వలన డయాబెటిస్ రక్తపోటు ఉన్నవారు జామకాయ తింటే చాలా మంచిది. జామకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.