వంటల్లో ఏ నూనె వాడుతున్నారు..ఇది తెలియకపోతే రిస్క్ లో పడినట్టే
Cooking oils In telugu :వంట నూనెలు మితిమీరి వాడటం వలన అధిక బరువు, కొలెస్ట్రాల్, జీర్ణకోశవ్యాధులు, గుండె జబ్బులు వంటివి వస్తున్నాయి. ఆలా అని నూనె వాడకాన్ని బాగా తగ్గించేస్తే శరీరానికి అవసరమైన కొవ్వు అందదు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
నూనెను మితంగా వాడితే ఎటువంటి ప్రమాదం ఉండదు. అలాగే ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇప్పుడు మార్కెట్ లో అనేక రకాల నూనెలు లభ్యం అవుతున్నాయి. వీటిలో ఏ నూనె వంటల్లో వాడితే మంచిదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
సన్ ఫ్లవర్ ఆయిల్
పొద్దుతిరుగుడు గింజల నుండి తీసే ఈ నూనె వంటల్లో వాడటం వలన గుండెకు సంబంధింత సమస్యలు రావు. ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఆర్థరైటిస్ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి నాడీమండల వ్యవస్థను చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ నూనె నుండి ఎక్కువ విటమిన్స్ పొందవచ్చు.
వేరుశనగ నూనె
ఈ నూనె వాడటం వలన శరీరానికి అవసరమైన ఎనర్జీ వస్తుంది. వేరుశనగ నూనెలో మోనో శాచురేటెడ్, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అయితే ఈ నూనెను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు పొగ ఎక్కువగా వస్తుంది. పూర్వం ఎక్కువగా ఈ నూనెను వాడటం వలన చేసే వంటలు రుచికరంగా.. ఘుమఘుమల సువాసన వెదజల్లేవి. వంద గ్రాముల వేరుశనగ నూనెలో 884 క్యాలరీల శక్తి వస్తుంది. ఈ నూనె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడమే కాదు.. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.
పామ్ ఆయిల్
పామ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటిన్, విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెలో వయసును తగ్గించే గుణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొలస్ట్రాల్ ఉన్నవారు పామ్ ఆయిల్ వాడకూడదు. పామ్ ఆయిల్ కొవ్వుని డిపాజిట్ చేస్తుంది. మీరు పామ్ అయిల్ వాడినాకొద్దీ లావెక్కుతూనే ఉంటారు. మిగితా ఆయిల్స్ తో పోలిస్తే పామ్ ఆయిల్ అతి సులువుగా బరువును పెంచుతుంది. అయితే ఇక్కడ బరువు కన్నా పెద్ద సమస్య కొవ్వు పెరిగిపోవటం. కాబట్టి పామ్ ఆయిల్ కి కాస్త దూరంగా ఉండటమే మంచిది. పామ్ ఆయిల్ వాడటం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.అయితే మోతాదుకు మించి వాడకూడదు.
రైస్ రిచ్ ఆయిల్
రైస్ రిచ్ ఆయిల్ లో సంతృప్త , అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,తక్కువ కొలస్ట్రాల్ ఉంటాయి. రెఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో వ్యాక్స్ 2.0% వరకు వుండటం వలన, మిగతా అయిల్స్ కన్న కలరు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు కనిపిస్తుంది. ఈ నూనెకి స్మోక్‌పాయింట్ మిగతా నూనెలకన్న ఎక్కువగా ఉండుట వలన డిప్ ఫ్రైయింగ్, రోస్టింగులకు ఉపయోగించవచ్చు. రైస్ రిచ్ ఆయిల్ లో ఓరైజనోల్ ఉండుట వలన గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజపరుస్తుంది. ఈ నూనె చర్మానికి మెరుపును ఇస్తుంది.
ఆలివ్ ఆయిల్
అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి నాడీమండల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, గుండె సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది.