7 రోజుల్లో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,బలంగా,ఆరోగ్యంగా పెరుగుతుంది
Rice Hair Care Tips : జుట్టు అందంగా పొడవుగా,ఒత్తుగా ఉండాలని కోరుకోవటం సహజమే. మారిన పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. కాస్త ఓపిక,సమయం కేటాయిస్తే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి 2 స్పూన్ల బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్ లో నీటిని పోసి ఒక స్పూన్ ఆవిసే గింజలను వేసి రెండు గంటల పాటు అలా వదిలేస్తే జెల్ తయారవుతుంది. ఈ జెల్ ని వడకట్టి పక్కన పెట్టాలి. ఒక మిక్సీ జార్ లో అన్నం, ఆవిసే గింజల జెల్,ఒక స్పూన్ అలెవెరా జెల్ వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బియ్యంలో ఉండే ఆమినో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/