పరగడుపున 1 గ్లాస్ 10 రోజులు తాగితే ప్రేగులు, కాలేయం మరియు రక్త నాళాలు శుభ్రం అవుతాయి
Cleanses the liver, intestines and blood vessels : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ఆసక్తి చూపుతూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు యాపిల్, బీట్ రూట్, క్యారెట్ ఈ మూడింటినీ కలిపి తయారుచేసినా డ్రింక్ తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున తీసుకుంటే ప్రేగులు, కాలేయం, రక్తనాళాలు శుభ్రం అవుతాయి. రెండు క్యారెట్ లను తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. క్యారెట్ కాలేయ పనితీరును ప్రేరేపిస్తుంది. కాలేయంలో టాక్సిన్స్ పేరుకుపోకుండా కూడా నిరోదించి మెరుగైన కాలేయ పనితీరును ప్రోత్సహిస్తుంది.
ఒక ఆపిల్ తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆపిల్ లో పెక్టిన్ ఉండుట వలన జీర్ణవ్యవస్థ నుండి విషాన్ని తొలగిస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. హానికరమైన పదార్ధాల మొత్తాన్ని తగ్గించటం వలన కాలేయంపై బారం తగ్గుతుంది. దాంతో కాలేయం పనితీరు బాగుంటుంది.
బీట్ రూట్ లో సగాన్ని తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బీట్ రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఒక మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు,ఆపిల్ ముక్కలు,బీట్ రూట్ ముక్కలు, ఒక గ్లాస్ నీటిని వేసి మిక్సీ చేయాలి.
మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున లేదా బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే ప్రేగులు, కాలేయం మరియు రక్త నాళాలు శుభ్రం అవుతాయి. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/