Beauty Tips

వారంలో 2 సార్లు వాడితే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Alovera Hair Loss Home remedies In telugu : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా .చూసుకోవాలి. జుట్టు కుదుళ్ళు బలంగా లేకపోతే జుట్టు రాలిపోతుంది. .
kalabanda beauty
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వైపు చూస్తూ ఉంటారు. అలా వాటిని వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మనం మంచి పోషకాహారం తింటూ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఒక సీర‌మ్‌ ను తయారు చేసుకుందాం. దీని కోసం ముందుగా మూడు స్పూన్ల కలోంజి విత్తనాలను మెత్తని పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి గిన్నెపెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడయ్యాక తయారు చేసి పెట్టుకున్న కలోంచి సీడ్స్ పొడి వేసుకోవాలి. .
hair fall tips in telugu
నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడగట్టాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల అలోవెరా జెల్, కలోంజీ గింజల నీటిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్,నాలుగు చుక్కల పెప్పర్ మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
Kunkudu kaya
ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ సీర‌మ్‌ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనలో చాలామంది మార్కెట్లో దొరికే సీర‌మ్‌ లను వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ సీర‌మ్‌ ని వాడి చూడండి…అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.