మన హీరోయిన్స్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో ?
Star Heroines Missed Movies :ఫలానా హీరోతో ఒక సినిమా తీయాలంటే ముందుగా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్, టెక్నీషియన్స్, ఇతర తారాగణం ఎంపిక చేయాలి. ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి వస్తాయి. అయితే ముందుగా ఒక హీరోయిన్ ని అనుకున్నా, ఆతర్వాత మారిపోయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
అందులో కొన్నింటిని తీసుకుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ లో అనిషా అమ్బరోస్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసారు. అయితే ఆమె లుక్ లో సెట్ కాకపోవడంతో కాజల్ అగర్వాల్ కి ఆ ఛాన్స్ దక్కింది. బిజినెస్ మాన్ లో శృతి హాసన్ ని అనుకుంటే కాజల్ అలాగే రెబెల్ లో అనుష్కను అనుకుంటే తమన్నా చేరింది.
రంగస్థలం మూవీలో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని డైరెక్టర్ సుకుమార్ భావించినప్పటికీ సమంత ఫైనల్ అయింది. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప మూవీకి అనుష్కను తీసుకోవాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అనుకుంటే, ప్రియమణి ఫైనల్ అయింది. రాజుగారి గది 3లో తమన్నాను తీసుకోవాలని డైరెక్టర్ ఓంకార్ అనుకుంటే అవికా ని సెలెక్ట్ చేసారు.
గీత గోవిందం మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నా రష్మిక మందన్న సెలక్ట్ అయింది. మహానటి మూవీకోసం నిత్యామీనన్ ని అనుకున్నారట. అయితే కీర్తి సురేష్ కి దక్కింది. రాక్షసుడు మూవీలో రాశీఖన్నాను అనుకున్నా, అనుపమ పరమేశ్వరన్ సెలెక్ట్ అయింది. వరుణ్ తేజ్ నటించిన బాక్సర్ మూవీ ఇంకా రాలేదు. ఈ మూవీలో కైరా అద్వానీని అనుకున్నా , ఆఖరికి సాయి మంజ్రేకర్ సెలక్ట్ అయింది.
జెర్సీ హిందీ మూవీలో రష్మిక మందన్న ను అనుకున్నారు కానీ, మృణాల్ చాకోర్ సెలెక్ట్ అయింది. ఇక స్టార్ డైరెక్టర్ మణిరత్నం ‘ చెలియా’ మూవీలో సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నా, చివరకు అదితిరావ్ సెలెక్ట్ అయింది. అమర్ అక్బర్ ఆంటోనిలో ఇమ్మానియల్ ని అనుకున్నా చివరకు ఇలియానా సెలెక్ట్ అయింది. కొచాడియన్ మూవీ అనుష్క ను అనుకున్నారు కానీ,దీపికా పదుకునే ఫైనల్ అయింది.
https://www.chaipakodi.com/