Beauty Tips

జుట్టుకి ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు జుట్టు రాలే సమస్య,పొడి జుట్టు,చుండ్రు సమస్య తొలగిపోతాయి

Hair growth tonic In Telugu : ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. కానీ వాటిల్లో కెమికల్స్ ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .
hair fall tips in telugu
అలా కాకుండా మన వంటగదిలో ఉండే వాటితోనే హెయిర్ టానిక్ తయారు చేసుకొని ఒక పది రోజులు ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీని కోసం మనం కేవలం మూడు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. రెండు స్పూన్ల మెంతులను తీసుకోవాలి.
fenugreek seeds
మెంతులు జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేయడంలో సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఆ తర్వాత రెండు స్పూన్ల బియ్యం తీసుకోవాలి. బియ్యం నీరు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. బియ్యం నీటిలో ఉన్న పోషకాలు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. .
Rice Water Benefits
ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల లవంగాలను తీసుకోవాలి. లవంగాలు కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి మెంతులు., బియ్యం, లవంగాలు వేసుకోవాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగిస్తే ఆ నీరు పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఆ నీటిని వడకట్టుకోవాలి.
Diabetes tips in telugu
చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో ఈ నీటిని పోసి జుట్టుకు స్ప్రే చేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా పది రోజులు పాటు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు,దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి..
Hair Care
ఈ నీటిని వేడిగా ఉన్నప్పుడు జుట్టుకి అప్లై చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేస్తే జుట్టు డామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బియ్యం,మెంతులు,లవంగాల్లో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.