ప్రభాస్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టరే..అవి ఏమిటో తెలుసా?
Prabhas Rejected Movies: ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం సినిమా పరిశ్రమంలో సాధారణమే. అయితే ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేసినప్పుడు హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలా ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలలో హిట్ అయిన సినిమాలు గురించి చూద్దాం.
గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా మొదట ప్రభాస్ తో చేయాలని అనుకున్నారు. కథ విన్నాక రిస్క్ అనిపించడంతో నో చెప్పేసారు.
వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాలో కూడా ముందుగా ప్రభాస్ ని అనుకున్నారు. కథ విన్న తర్వాత ప్రభాస్ మరో సినిమాతో బిజీగా ఉండటం వలన ఆ సినిమాను చేయలేకపోయాడు. దాంతో ఆ అవకాశం నితిన్ కి వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా మొదట ప్రభాస్ దగ్గరికి వచ్చింది. అయితే మాస్ కథ కావడంతో ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా కూడా ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్ళితే తన ఇమేజ్ కి సెట్ కాదని వదిలేసాడట. ఆ తర్వాత ఆ అవకాశం అల్లు అర్జున్ కి వచ్చింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమా మొదట ప్రభాస్ కి కధ వినిపించారట. ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండటం వలన చేయలేకపోయాడు. ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చింది.
వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ సినిమాలో కూడా ప్రభాస్ కి అవకాశం వచ్చింది. సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆ సినిమాకు ఓకే చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఆ అవకాశం రాంచరణ్ కి వచ్చింది.
రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమా మొదట ప్రభాస్ దగ్గరికే వచ్చింది. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడు.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాను కూడా ప్రభాస్ అప్పటి పరిస్థితుల దృష్ట్యా రిజెక్ట్ చేశాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన డాన్ శీను సినిమా కూడా మొదట ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. ఈ కథను ప్రత్యేకంగా ప్రభాస్ కోసమే రాశారట. అయితే అప్పటికే బుజ్జిగాడు సినిమా చేసిన ప్రభాస్ డాన్ శీను కథ కూడా దాన్ని పోలి ఉంటుందని భావనతో రిజెక్ట్ చేసాడట.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జిల్ సినిమా మొదట ప్రభాస్ వద్దకే వచ్చింది. అయితే ప్రభాస్ బాహుబలి సినిమాతో బిజీగా ఉండటంతో గోపీచంద్ కు రిఫర్ చేశాడు.
https://www.chaipakodi.com/