MoviesTollywood news in telugu

రాంచరణ్,ఉపాసన కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటో తెలుసా…?

Ram Charan Upasana Daughter:మెగా కోడలు ఉపాసన జూన్ 20 వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో… పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనల వివాహం జరిగి దాదాపు 11 సంవత్సరాలు దాటింది. దాంతో మెగా వారసురాలు రావటంతో చాలా ఆనందంగా ఉన్నారు మెగా ఫ్యామిలీ.

రామ్ చరణ్,ఉపాసన దంపతుల కూతురికి క్లింకారా కొణిదెల(Klin Kaara konidela) అనే పేరును పెట్టారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ మరియు ఉపాసన తెలిపారు. క్లింకారా(Klin Kaara konidela) అంటే అర్ధం ఏమిటా అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. క్లింకారా అంటే అర్థం లలిత సహస్రనామాలలో బీజాక్షరం.

ప్రకృతి శక్తికి ప్రతిరూపం. ఆధ్యాత్మికతను పెంపొందించేలా శక్తిని శుద్ధి చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత పది రోజుల నుంచి చిరంజీవి మనవరాలు గురించిన చర్చ చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో సాగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."