శరీరంలో B12 లోపిస్తే లక్షణాలు…ఈ ఆహారాలను తీసుకుంటే జీవితంలో B12 లోపం ఉండదు
Vitamin B12 Foods for Vegetarians : విటమిన్ బి 12 అనేది మనం తీసుకొనే ఆహారాల ద్వారానే లభిస్తుంది. ఈ విటమిన్ లోపం లేకుండా ఉండాలంటే బి12 సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. Egg లో ప్రోటీన్స్, ఎన్నో విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. విటమిన్ బి -12 అనేది కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో ఎక్కువగా ఉంటుంది.

శాఖాహారులకు బి 12 పాల ద్వారా బాగా లభిస్తుంది. జున్నులో కూడా బి 12 ఉంటుంది. మార్కెట్లో లభించే జున్ను కన్నా ఇంట్లో తయారు చేసుకునే జున్నులో అధిక మొత్తంలో విటమిన్ బీ12 లభిస్తుంది. అలాగే పనీర్,పెరుగు,మజ్జిగ వంటి వాటిలో బి 12 ఉంటుంది. హెర్రింగ్, సాల్మన్, సార్డినెస్, ట్యూనా ట్రౌట్ వంటి చేపలలో బి 12 సమృద్దిగా లభిస్తుంది. మాంసంలో కూడా విటమిన్ బి -12 సమృద్దిగానే ఉంటుంది.

ఈ విటమిన్ లో కోబాల్ట్ కూడా ఉంటుంది. అందుకే, ఈ విటమిన్ ని కోబాల్మిన్ అని అంటారు. ఈ విటమిన్ కొత్త ఎర్ర రక్తకణాలను క్రియేట్ చేస్తుంది. DNA ని సింథసైజ్ చేస్తుంది. మెదడూ, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

ఆకలి లేకపోవడం,కాళ్ళూ, చేతులూ తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, నీరసం, నిస్సతువ వంటి లక్షణాలు కనిపించినప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
Click Here To Follow Chaipakodi On Google News
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

