Healthhealth tips in telugu

చేతి వేళ్లను విరిచినప్పడు శబ్దం వస్తుంది… ఎందుకో తెలుసా ?

Fingers sounds in Telugu : సాధారణంగా మనలో చాలామందికి వెళ్ళను వెనక్కి పక్కకి పంచడం వలన శబ్దం అనేది వస్తుంది. ఇలా వంచటం వలన కొంత మందికి పిజికల్ రిలాక్స్ వస్తుంది. మరి కొంతమంది టైంపాస్ కి చేస్తూ ఉంటారు. మొదటిసారి విరిచినప్పుడు శబ్దం వస్తుంది రెండో సారి విరిచినప్పుడు ఎలాంటి శబ్దం రాదు.
hands sounds
మొదటిసారి ఆ శబ్దం ఎందుకు వస్తుందో మనలో చాలామందికి తెలీదు. ఎముకలు కదలటం వలన శబ్దం వస్తుంది అని భావిస్తారు. కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. మన శరీరంలో రెండు ఎముకల మధ్య ఉండే సినోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికేట్ గా పనిచేస్తుంది. చేతులను వేళ్లను వంచినప్పుడు లేదా విరిచినప్పుడు ఈ ఫ్లూయిడ్ నుండి నైట్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది.
Fingers sounds in Telugu
నైట్రోజన్ గ్యాస్ బుడగల ను ఉత్పత్తి చేస్తుంది ఈ బుడగలు పగిలినప్పుడు శబ్దం వస్తుంది. మరల ఈ నైట్రోజన్ బుడగలు రావాలి అంటే కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. చాలా మంది టైం పాస్ కోసం తరచుగా ఇలా వేళ్లను విరుస్తూ ఉంటారు. మన శరీరంలోని ఎముకల మధ్య ఉండే ఈ సినోవియల్ ఫ్లూయిడ్ ఎముకలకు నొప్పి పుట్టకుండా, అవి అరిగిపోకుండా స్మూత్ గా కదిలేలా ఈ లూబ్రికెంట్ ఉపయోగపడుతుంది. వయసు మీద పడ్డవాళ్లలో ఈ ఫ్లూయిడ్ అయిపోవటం వల్ల మోకాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు వస్తుంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."