5 రోజుల్లో జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా మార్చి,జీవితంలో జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తుంది
Hair Fall And Hair Loss Tips In telugu : ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
ఒక పాన్ లో రెండు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ kalonji seeds, ఒక స్పూన్ మెంతులు, 100 ml ఆవనూనె వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన నూనె కొంచెం చల్లారాక సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే kalonji seeds లో ఉండే లక్షణాలు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
తమలపాకులో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతుంది. అలాగే ఆవనూనెలో ఉండే పోషకాలు నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు చిక్కువడటం, చుండ్రు, డ్రై హెయిర్ వంటి అనేక సమస్యలకు ఆవనూనె మంచి పరిష్కారం చూపుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/