MoviesTollywood news in telugu

ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌ మరింత గరం గరం..వీరు పక్కా…?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ telugu ఏడవ సీజన్ త్వరలో ప్రారంభం అవుతుంది. స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుండి చాలా బజ్ వచ్చింది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు…అనే విషయం మీద సోషల్ మీడియాలో చాలా చర్చ సాగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 7 లో పాల్గొనే వారి పేర్లు కొన్ని సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

కార్తిక దీపం సీరియల్‌లో డాక్టర్ మోనితగా ఫేమస్ అయినా శోభ శెట్టి. ఈమె దాదాపుగా ఖరారు అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విష్ణు ప్రియ. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది.

బేబి సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి కూడా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కన్నడ భామ అయినా నవ్య స్వామి telugu సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇమే కూడా బిగ్ బాస్ ఏడవ సీజన్ లో ఉందని సమాచారం.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు‌గా నటించి మంచి పేరు సంపాదించిన సురేఖ వాణి. ఇమే సోషల్ మీడియాలో చాలా ఏక్టివ్ గా ఉండి అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.

తెలుగులో బుల్లెట్ బండి పాటతో ఫేమస్ అయిన మోహన భోగరాజు. ప్రతి సీజన్ లో ఒక సింగర్ కి స్థానం ఉంటుంది. అలా ఇమే ఈ సారి బిగ్ బాస్ హౌస్ కి అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈటీవీలో వచ్చే పలు సీరియల్స్‌‌లో నటించి పాపులర్ అయినా ప్రభాకర్ఒక పక్క నటిస్తూనే సీరియల్స్ దర్శక,నిర్మాణంలో కూడా చాలా బిజీగా ఉన్నాడు.

టిక్ ‌టాక్ నుంచి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న దీపిక పిల్లి పేరు కూడా బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈటీవీలో ప్ర‌సారం అయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో ఓ టీమ్ లీడర్‌గా ఉంది.

టిక్ టాక్ దుర్గారావు దంపతుల పేరు కూడా బాగా వినిపిస్తుంది. వీరి పేరు గత రెండు సీజన్ ల నుండి వినిపిస్తుంది. వీరికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది.