శోభన్ బాబు ఆస్తి విలువ ఎన్నివేల కోట్లో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Sobhan babu assets value:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు. మహిళలు మెచ్చే అందగాడు. ఇక భౌతికంగా లేకున్నా ఇప్పటికీ శోభన్ బాబు అంటే, పడి చచ్చిపోయే అభిమానులున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. శోభన్ బాబు సినిమాలు వస్తే ఈ రోజుకీ టీవీల ముందు అతుక్కుపోయే ఆడవాళ్లు చాలామంది ఉంటారు.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండోవైపు కూడా ఉంది. ఈయన ఎంత పెద్ద హీరోనో అంతకంటే రెండింతలు.. కాదు కాదు పదింతలు బిజినెస్ మ్యాన్ అని చెప్పాలి. దక్షిణాదిన కాదు.. ఇండియాలోనే శోభన్ బాబు కంటే ఆస్తిపరుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని అంటారు.శోభన్ బాబు హీరోగా ఉంటూనే మరోపక్క భూములు కొని పెట్టుబడి పెట్టాడు.
ఇలా ఉండాలని కూడా కొందరికి సూచించాడు. అలా శోభన్ బాబుని ఫాలో అయినవాళ్ళల్లో ఆయన స్నేహితుడు మురళీ మోహన్ ఒకడు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినపుడు మురళీ మోహన్ ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు. మద్రాసులో స్టార్ హీరోగా ఉన్నపుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని.. అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.
శోభన్ బాబు చనిపోయే నాటికి ఆస్తి దాదాపు 80 వేల కోట్లు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1976లోనే కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ తీసుకున్నాడని.. అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికీ తెలియదని.. అలాంటి సమయంలోనే శోభన్ బాబు బిజినెస్ చేసేవాడని మురళీ మోహన్ చెప్పాడు .ఇప్పటికీ కూడా చెన్నైలో, చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు. నిజానికి శోభన్ బాబు స్పూర్థితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టినట్లు చెప్పాడు.
భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన సన్నిహితులకు చెప్పేవాడని, అలా తనకు కూడా చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. శోభన్ బాబు ఆస్తిని ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం అంటున్నాడు. షేర్స్, బిజినెస్ అలా ఎన్నో చేసాడని.. మద్రాసులో ఆయన టైమ్ పాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులు అన్నీ చూడ్డానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని.. దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కవేసుకోవాలని ఓ సినీ విశ్లేషకుడు వివరించాడు.