Healthhealth tips in telugu

గర్భిణీ స్త్రీలు ఈ ఆకును తమ ఆహారంలో చేర్చుకుంటే.. ఊహించని ఎన్నో ప్రయోజనాలు

Tulasi health benefits:తులసి ఆకులలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు తులసి ఆకులను తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోవచ్చా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

తులసి ఆకులలో విటమిన్ K, మాంగనీస్,విటమిన్ A, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వులు వంటివి సమృద్దిగా ఉంటాయి. తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, రిబోఫ్లావిన్, నియాసిన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, రాగి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

ఐరన్ సమృద్దిగా ఉండుట వలన గర్భాదరణ సమయంలో సాదారణంగా కనిపించే రక్త హీనత సమస్య రాకుండా కాపాడుతుంది. తులసిలో ఉండే మాంగనీస్ శిశువు యొక్క ఎముకలు మరియు మృదులాస్థిని ఏర్పరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, తల్లికి సెల్యులార్ డ్యామేజ్ కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.

విటమిన్ A గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో రక్త సరఫరాకు ముఖ్యమైన ఫోలేట్ కూడా తులసిలో పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను పెంచుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.

అయితే గర్భిణీ స్త్రీలు తులసి ఆకులను ఎక్కువగ్ తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజుకి రెండు లేదా మూడు ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటె వెంటనే డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి.