Drinking Water:ఆహారం తిన్న వెంటనే నీళ్ళు తాగుతున్నారా…ఏ సమయంలో తాగాలి…తెలుసుకోండి..?
Drinking Water:మంచినీరు అనేవి మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విషయం మనకు తెలిసిందే. ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగటం మంచిదా.. చెడ్డదా అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా… ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అలాగే నష్టాలు గురించి తెలుసుకుందాం.
నీటిని ఎక్కువగా తాగటం వలన మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి శరీరం మనం తినే ఆహారం నుండి అన్ని పోషకాలను గ్రహిస్తుంది. అయితే జామ, అరటి, పుచ్చకాయ వంటి కొన్ని పండ్లను తిన్న వెంటనే నీటిని తాగకూడదు. బ్రెడ్, బంగాళదుంప వంటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా తిన్న వెంటనే నీటిని తాగకూడదు.
ఈ విధంగా నీటిని తాగడం వలన అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి. తిన్నా వెంటనే నీటిని తాగడం వలన జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా చల్లని నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరులో మార్పులు వస్తాయి. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలి.
భోజనం చేసిన తర్వాత అల్లం, పుదీనా వంటి వాటిని వేసిన హెర్బల్ టీ తీసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటమే కాకుండా గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

