Healthhealth tips in telugu

Uric Acid: ఉదయాన్నే ఈ ఆకు తినండి… కీళ్ల నొప్పులు మటు మాయం..!

Betel Leaf For Uric Acid: ఈ మధ్య కాలంలో చాలా మంది Uric Acid సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు బాధ చాలా విపరీతంగా ఉంటుంది. అసలు మన శరీరంలో Uric Acid స్థాయిలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. Uric Acid స్థాయిలు ఉన్నప్పుడు డాక్టర్ సూచనలు పాటించాలి.

అలా పాటిస్తూ Uric Acid స్థాయిలను తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. Uric Acid స్థాయిలను తగ్గించటానికి తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది. మన శరీరంలో డెసిలీటర్‌కు 3.5 నుండి 7.2 mg/dL యూరిక్ యాసిడ్ ఉండాలి. కానీ అనేక కారణాల వల్ల మన రక్తంలోని యూరిక్ యాసిడ్ మీటర్ 7 mg/dL దాటుతుంది.

యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోయినప్పుడు, కీళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఉదయాన్నే ఒక చిన్న తమలపాకును నమలడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పి నుండి శాశ్వత ఉపశమనం పొందవచ్చు. తమలపాకు నమలటం కష్టంగా ఉన్నవారు ఈ విధంగా కూడా చేయవచ్చు.

రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. రాత్రంతా మూత పెట్టి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.. లేదంటే ఉదయం సమయంలో ఒక తమలపాకును చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఈ విధానాల్లో ఏ విధానాన్ని ఫాలో అయిన మంచి ఫలితమే కలుగుతుంది.

తమలపాకులో ప్రోటీన్, అయోడిన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ విధంగా తమలపాకు తీసుకోవడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News