Saloni Aswani : మర్యాదరామన్న హీరోయిన్ సలోని గుర్తుందా? ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా…?
Telugu heroine saloni aswani :కమెడియన్ సునీల్ హీరోగా అవతారం ఎత్తి పలు సినిమాలు చేసాడు. అందులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన మర్యాదరామన్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో సునీల్ సరసన సలోని అశ్విని హీరోయిన్ గా చేసింది. కామెడీ ట్రాక్ తో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ సినిమా కు జనం నీరాజనం పట్టారు. ఇక సునీల్,సలోని జంట బాగా కుదిరింది.
ఆతర్వాత సునీల్ హీరోగా పెద్దగా హిట్స్ లేకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా స్థిరపడిపోయి, తన సినిమాలు తాను చేసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు సునీల్ విలన్ గా ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఇక సలోని విషయానికి వస్తే…
మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్న సలోనిని.. ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహించింది. సలోనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వస్తున్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ భామ రీ ఎంట్రీకి సిద్దం అయినట్టు వార్తలు వస్తున్నాయి. హారర్ ఎంటర్‌టైనర్ ‘తంత్ర'(Thantra) సినిమాతో అభిమానుల ముందుకు రావటానికి సిద్దం అయింది. ఈ సినిమా సలోనికి మంచి కమ్‌బ్యాక్ అవుతుందని ఆశిద్దాం. ఇంకా మరెన్నో మంచి పాత్రలతో అభిమానులను అలరించాలని కోరుకుందాం.