MoviesTollywood news in telugu

Tollywood:విక్టరీ వెంకటేష్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న సమయం…మీకు తెలుసా?

Tollywood Hero venkatesh:సినీ మాయ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. హీరోలకు,హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమ అభిమాన నటుల గురించి ఏ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. తెలిసిన విషయాన్నీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తారు.

కలియుగ పాండవులు మూవీ ద్వారా తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ అనతికాలంలోనే విక్టరీ వెంకటేష్ అయ్యాడు. అప్పట్లో నలుగురు హీరోల్లో,ఇప్పుడు ఆరుగురు హీరోల్లో సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచాడు. 1996నుంచి 2001వరకూ వెంకీ కి మంచి పీక్ టైం నడిచింది. ఎందుకంటే ఆసమయంలో 18సినిమాలు విడుదల కాగా అందులో 13సినిమాలు హిట్ అయ్యాయి. 75శాతం సక్సెస్ అందుకున్నాడు.

ఇండస్ట్రీకి రెండు కళ్లుగా భావించే ఎన్టీఆర్ ,అక్కినేని లను మినహాయిస్తే, వెంకీ సక్సెస్ రేటు ఎవరికీ లేదని విశ్లేషకులు చెప్పేమాట. ప్రతియేటా వెంకీ సినిమా టాప్ 3గానీ టాప్ 4లో గానీ ఉండేది. ప్రతియేటా హయ్యస్ట్ గ్రాస్ లో వరుసగా ఆరు సినిమాలు టాప్ 2గానీ, 3లో గానే ఉండడం కూడా మరో రికార్డ్ అని చెబుతారు.

1996లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు,ధర్మచక్రం,పవిత్ర బంధం,సాహసవీరుడు సాగర కన్య సినిమాలు హిట్ అయ్యాయి.అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ ఆ ఏడాది టాప్ త్రీలో , ఆల్ టైం టాప్ 4లో ఉంటుంది. 1997లో ప్రేమించుకుందాం రా, పెళ్లిచేసుకుందాం హిట్ అందుకోగా, ప్రేమించుకుందాం రా మూవీ టాప్ 2లో ఉంటుంది.

1998లో గణేష్,సూర్యవంశం,ప్రేమంటే ఇదేరా మూవీస్ హిట్ అవ్వగా, ఇందులో సూర్యవంశం ఆల్ టైం టాప్ రికార్డ్ లో ఉంది. 1999లో రాజా ఆల్ టైం టాప్ 2మూవీగా నిల్చింది. 2000లో కలిసుందాం రా,జయం మనదేరా హిట్ అయ్యాయి. ఇందులో కలిసుందాం రా మూవీ టాప్ లో ఉంది. 2001లో నువ్వు నాకు నచ్చావ్ హిట్ అవ్వడమే కాదు ఆల్ టైం టాప్ త్రిలో ఉంది.
Click Here To Follow Chaipakodi On Google News