Devotional

Krishnashtami 2023 : కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే…మీరు చేస్తున్నారా…?

Krishnashtami 2023 :శ్రావణ మాసంలో వచ్చే మరో పండుగ కృష్ణాష్టమి. ద్వాపర యుగంలో శ్రీకృషుడు విష్ణు మూర్తి ఎనిమిదోవ అవతారంగా అవతరించారు. కృష్ణుడు పుట్టిన రోజును కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. కృష్ణుడు జన్మించిన రోజు కావున జన్మాష్టమి అని పిలుస్తారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది.

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టి పూజ చేస్తారు. శ్రీకృష్ణుడుకి ఇష్టమైనవి ఏమిటంటే ఆవు పాలు,వెన్న,మీగడ అంటూ చకచకా చెప్పేస్తాం. గోవులకు,గోపాలకులకు రక్షణగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించారు.

గోవుల పట్ల ఇష్టంతోనే గోపాలుడు అయ్యారు. వాటి మీద ప్రేమతో ఆవు పాలు,వెన్నలను ఇష్టంగా తినేవాడు. వెన్న దొంగిలించిన మిగతా గోపాలురకు పెట్టి ఆ తర్వాతే తినేవాడు. వెన్న దొంగలించిన ఇంటిలో పాలు,వెన్న సమృద్ధిగా ఉండేలా అనుగ్రహించేవారు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు రావాలని ఇంటి గుమ్మం నుండి ఇంటిలోకి కృష్ణ పాదాలు వేస్తారు.

శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. కృష్ణాష్టమి రోజు సాయంత్రం వీధులలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
Click Here To Follow Chaipakodi On Google News