krishnashtami puja:కృష్ణాష్టమి రోజు పూజ ఎలా చేయాలి?
krishnashtami puja:కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే తలస్నానము చేసి తులసి దళాలు వేసిన నీటితో ఆచమనం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి,సాయంత్రం ఇంటి మధ్యలో గోమయంతో అలికి ముగ్గు వేయాలి. ముగ్గు మీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి కొత్త కుండను ఉంచాలి. ఆ కుండను వస్త్రంతో అలంకారం చేయాలి.
ఈ కులశం మీద కృషుని ప్రతిమ పెట్టి ముందుగా దేవకీదేవి ప్రార్ధన ఆ తర్వాత కృష్ణప్రార్థన చేయాలి. వేగించిన మినపపిండితో పంచదార కలిపి దేవకీదేవికి నివేదన చేయాలి.అర్ధరాత్రి వరకు శ్రీ కృష్ణుడికి పూజలు చేసి పాలు, పెరుగు, వెన్న,అటుకులు,బెల్లం నైవేద్యం పెట్టాలి. రాత్రి జాగారం చేసి మరుసటి రోజు భోజనం చేయాలి.
ఇలా ఉపవాసం,జాగరణ చేయలేనివారు శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి.గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే “పొంనమాను సేవ” అని అంటారు.
Click Here To Follow Chaipakodi On Google News