Kitchenvantalu

Bread Upma:బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ ఉప్మా.. కొంచెం సాఫ్ట్, కొంచెం క్రిస్పీ.. దీని రుచిని మర్చిపోరు

Bread Upma:ఇడ్లీ, దోశ,పూరి అంటే ఎగిరి గంతేస్తారు. ఉప్మా అనగానే, పెదవి విరుస్తారు. కాని ఉప్మాలో కూడా, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బ్రెడ్ తో ఓసారి ఇలా ట్రై చేయండి. నో అనకుండా తినేస్తారు

కావాల్సిన పదార్దాలు
బ్రౌడ్ బ్రెడ్ ముక్కలు -6
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నూనె – 2 స్పూన్స్
ఆవాలు – 1 స్పూన్
జీడిపప్పు – 10
జీలకర్ర – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
నిమ్మరసం – 1 టీ స్పూన్
కారం – 1/2టీ స్పూన్
ఉప్పు –రుచికి సరిపడా
సాంబార్ పొడి – 1/2టీ స్పూన్
మిరియాల పొడి – 1/4టీ స్పూన్
టమాటో -1
ఉల్లిపాయ -1
క్యాప్సికమ్ తరుగు – 1/4కప్పు
పచ్చిమిర్చి – 1 స్పూన్
అల్లం తరుగు – 1 స్పూన్

తయారీ విధానం

1. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, కొద్దిగా నెయ్యి వేసి, బ్రెడ్ ముక్కలను రెండు వైపులా కాల్చుకోవాలి
2. కాల్చిన బ్రెడ్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై వేరొక పాన్ పెట్టి, అందులోకి ఆయిలే వేసి, ఆవాలు, జీడిపప్పులు వేసి, కలర్ వచ్చే వరకు వేయించాలి.
4. ఇఫ్పుడు అందులోకి జీలకర్ర, కరివేపాకు, మరియు తరిగిన ఉల్లిపాయలు, వేసుకుని, ఒక నిముషం పాటు వేయించాలి.

5. ఇప్పుడు తరిగిన టమాటాలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అల్లం, ఉఫ్పు, ఎర్రకారం వేసి సాంబార్ పొడి, వేసి, టమాటో మెత్తపడే వరకు ఉడికించాలి.
6. కాస్త మెత్త పడ్డాక, పావు కప్పు నీళ్లు పోసుకుని, హై ఫ్లేమ్లో ఉడికించాలి.
7. ఇప్పుడు మరుగుతున్న ఆ మిశ్రమలంలోకి బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి, బాగా కలపాలి.
8. చివరగా 3 టేబుల్ స్పూన్ల నీళ్లను చల్లి, మిరియాలపొడి వేసుకుని, వేడి వేడిగా సెర్వ్ చేసుకోవాలి.
9. అంతే బ్రెడ్ ఉప్మా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News