Kitchenvantalu

Paneer Fried Rice:రెస్టారెంట్ స్టైల్ ప‌నీర్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లో ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Paneer Fried Rice : ఇంట్లో చేసుకునే, ఏ స్పెషల్ అయినా, రెస్టారెంట్ ఫుడ్ తర్వాతే అంటారు. ఆరోగ్యంలో ఎంతమంచిది అయినా, రుచితో పోలిస్తే రెస్టారెంట్ ఫుడ్నే ఇష్టపడతారు. కాని ఒక్కసారి ప‌నీర్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో తయారు చేసి చూడండి. అది రెస్ఠారెంట్ ఫుడ్ అంటే నమ్మేస్తారు పక్కా…

కావాల్సిన పదార్థాలు
ప‌నీర్ – 200 గ్రాములు
కారం – 2 చిటికెలు
టమాటో సాస్ – 1 టీ స్పూన్
నూనె – 4 టీ స్పూన్స్
వండిన బాస్ మతీ రైస్ – 150 గ్రాములు
ఉప్పు – తగినంత
ఆరోమెట్ పౌడర్ – 1/2టీస్పూన్
వైట్ పెప్పర్ – 1/2టీస్పూన్
మిరియాల పౌడర్ – 1/2టీస్పూన్
క్యారేట్ తరుగు – 1/4కప్పు
బీన్స్ తరుగు -1/4కప్పు
సోయా సాస్ – 1 టీస్పూన్
ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం

1.ఇప్పుడు స్టవ్ పాన్ పెట్టుకుని, నూనె వేసి, పన్నీర్ ముక్కలు వేసుకుని, కారం టమాటో సాస్ మిక్స్ చేసి, టాస్ చేసి పక్కన పెట్టుకోండి.
2.ఇప్పుడు వేరొక పాన్ లో, నూనె వేసి, వేడెక్కిన నూనెలోకి క్యారేట్, బీన్స్ తరుగు వేసి, హై ఫ్లైమ్ లో టాస్ చేసుకోవాలి.

3. ఒక నిముషం తర్వాత క్యారేట్ , బీన్స్ తరుగు లోకి వండిన బాస్ మతీ రైస్, పన్నీర్ ముక్కలు,బాస్ మతీ రైస్,పెప్పర్ పౌడర్, సోయా సాస్, అన్ని పదార్ధాలు వేసుకుని, చివరగా, ఉల్లికాడలను, కలిపేసి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4. అంతే యమ్మీ యమ్మీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News