Healthhealth tips in telugu

Acidity :క‌డుపులో మంట క్ష‌ణాల్లో త‌గ్గాలా..అయితే ఇలా చేయండి

Effective Remedy for Acidity: ఈ మధ్య కాలంలో కడుపులో మంట అనేది చాలా సర్వ సాధారణం అయ్యిపోయింది. సాధారణముగా మసాల ఉన్న పదార్దాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్దాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాల పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది.

కడుపులో వచ్చే మంట గ్యాస్ గా మారి అది గుండెల్లొ నొప్పిగా కూడ మారుతుంది. ఈరోజుల్లో రుచికరమైన ఆహారం కావలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు,కనుక మసాల ఉన్న ఆహారం తిన్నవెంటనే నీళ్ళు ఎక్కువగా తాగాలి లేదా జీర మజ్జిగ ను తీసుకున్నా సరిపోతుంది.

జీలకర్ర ను బాగా వేయించి పొడి చేసి దానిని నీళ్ళలో కలిపి తాగితే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

పూదీనా ఆకులను తీసుకొని నమిలినా లేదా తినే ఆహారంలో దానిని కలిపి తీసుకున్నా ఫలితముంటుంది. ఒక పచ్చడి రుపంలో గాని, పూదీన టీ గాని తీసుకొన్న కొంతవరకు కడుపు మంటను తగ్గించుకోవచ్చు.

మాంసాహారం తిన్నప్పుడు కూడా కడుపులో మంట వస్తుంది. అప్పుడు తిన్న వెంటనే సోడా గాని ఇతర పానియాలు సేవించడం వలన కడుపులో మంట రాకుండా ఉంటుంది.

విందు భోజనాలకు వెళ్ళినపుడు కూడ కడుపులో నొప్పి, మంట వంటివి వస్తాయి. అప్పుడు స్వీట్ పాన్ తీసుకొవడం వలన కడుపులో ఉన్న ఆహారాన్ని అరిగేలా చేయటమే కాక కడుపులో వచ్చే మంట, గ్యాస్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."