Wood Apple:ఈ సీజన్ లో వెలగ పండును తప్పకుండా తినాలి.. అస్సలు మిస్ చేయకండి!!
Wood Apple Health Benefits in telugu:రూటేసి కుంటుంబానికి చెందిన వెలగ పండును ఎలిఫెంట్ యాపిల్ లేక ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వెలగ పండు వగరు,పులుపు కలిసిన రుచితో ఉంటుంది. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపీ పులుపూ కలిపిన రుచితో ఉంటుంది. గణపతికి ప్రీతిపాత్రమైన వెలక్కాయలు పాలవెల్లి అలంకారంగానూ నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.
అలాగే వెలక్కాయలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెలగ పండు వగరు కారణంగా చాలా మంది తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. ఈ సీజన్ లో వెలక్కాయలు విరివిగా లభిస్తాయి. వెలగ పండు వినాయక చవితి నుండి వేసవి కాలం వరకు విరివిగా దొరుకుతాయి.
వీటిని ఈ సీజన్ లో తిని అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వెలగ పండులో పిండిపదార్థాలూ, ప్రొటీన్లు, బీటా కెరోటిన్ , థైమీన్ , రిబోఫ్లోవిన్ , నియాసిస్ , కాల్షియం, ఫాస్పరస్ , ఐరన్ , ఆక్సాలిక్ , మాలిక్, సిట్రిక్ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది.
వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ వృద్దాప్య ప్రక్రియను నిదానం చేస్తుంది. విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తి పెరిగేలా చేయటమే కాకుండా ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. బ్యాక్టీరియా మరియు వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
వెలగ పండులో సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు మరియు ఫ్లేవనాయిడ్లు ఉండుట వలన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. తామర చర్మ వ్యాధులను తగ్గించటానికి మరియు ఆర్థరైటిక్ నొప్పి నిర్వహణకు సహాయపడుతుంది. వెలగ పండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెలగ పండులో ఉండే అవసరమైన ఎలక్ట్రోలైట్‌లు ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.
వీటిలో ఉండే పొటాషియం మూత్రవిసర్జన ద్వారా లేదా చర్మం ద్వారా చెమట ద్వారా అధిక నీటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వెలగ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్నప్పుడు వెలక్కాయ తింటే మంచి ఫలితం కనపడుతుంది.
మలబద్దకం సమస్యకు చిన్న పిల్లలు కూడా వెలక్కాయను తినవచ్చు. క్యాన్సర్ నివారణలో కూడా వెలగ పండు సహాయపడుతుంది. వెలగ పండులో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన గాయాలను త్వరగా నయం చేస్తుంది. సహజ నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. జీవక్రియ ఫలితంగా ఏర్పడిన విషాలను తొలగిస్తుంది.
కాలేయ ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండుట వలన తక్షణ శక్తిని అందిస్తుంది. కాస్త అలసట,నీరసం ఉన్నప్పుడు వెలగ పండు తింటే మంచి ఫలితం కనపడుతుంది. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇవి వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు మరియు రక్తప్రవాహంలోకి ప్రవేశించే వేగం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు తగినవి కావు.
జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. వెలగ పండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలోను మరియు పాలిచ్చే తల్లులు వెలగ పండుకు దూరంగా ఉండటమే మంచిది.
మధుమేహం ఉన్నవారు మందులను వాడుతూ ఉంటే వారు వెలగ పండును తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెలగ పండు రక్తంలో చక్కర స్థాయిలను బాగా తగ్గిస్తుంది. శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు నుండే వెలగ పండును తినటం మానేయాలి. ఎందుకంటే వెలగపండు రక్తంలో చక్కర స్థాయిల మీద ప్రభావాన్ని చూపుతుంది. చూసారుగా వెలగ పండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్. వెలగ పండును మితంగా తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News