Healthhealth tips in telugu

Jasmin Flower Benefits: మల్లెలు అందానికే కాదు.. వీటివల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!

Jasmin Flower Benefits:మల్లె చెట్టు గురించి మనఅందరికి తెలుసు. ఈ కాలంలో మల్లెపూలు విరివిగా పూస్తాయి. మల్లె పువ్వు నుండి వచ్చే వాసనను అందరూ ఇష్టపడతారు. మల్లెచెట్టులను ఎక్కువగా మెల్లెపువ్వుల కోసం పెంచుతూ ఉంటారు.

అయితే మల్లె చెట్టు మరియు మల్లె పువ్వులు ఇంటి అలంకరణకే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మల్లెను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. మల్లె ఆకులను,పువ్వులను,వేర్లను ఇలా మల్లె చెట్టులో అన్ని భాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

పూర్వ కాలంలో మల్లె చెట్టును సాంప్రదాయ వైద్యంలోను ,ఆయుర్వేదంలోనూ ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కళ్ళు అలసి మంటగా ఉన్నప్పుడు  మల్లెపూలను కంటి  రెప్పలపై పెట్టుకుంటే చల్లగా ఉండటమే కాక కంటి మంట కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారికి మల్లెపువ్వులు మంచి ఔషధం అని చెప్పవచ్చు.

మల్లెపూలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. మెంతులను కూడా పొడిగా చేసుకోవాలి. మల్లె పువ్వుల పొడి,మెంతుల పొడిలో నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు తొలగిపోవటమే కాకుండా జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది.

కొబ్బరినూనెలో కొన్ని మల్లెలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు ఆ నూనెను బాగా మరగబెట్టి, చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే సువాసన వెదజల్లుతుంది. ఇది వెంట్రుకల అడుగున ఉండే మాడుకు కూడా  మంచిది.చర్మానికి అవసరమయ్యే సీ విటమిన్ మల్లెపూలలో పుష్కలంగా ఉంటుంది. చెవి నుండి చీము కారే సమస్య ఉన్నప్పుడు మల్లె ఆకు చాలా బాగా సహాయపడుతుంది. చెవిలో చీము కోరినప్పుడు నొప్పి విపరీతంగా వస్తుంది.

ఇప్పుడు మల్లె ఆకుతో చెప్పే ఈ చిట్కా వైద్యం చెవిలో చీము తగ్గించటానికి బాగా సహాయపడుతుంది. లేత మల్లె ఆకులను తీసుకోని శుభ్రంగా కడిగి మిక్సీ చేసి రసాన్ని తీయాలి. 6 స్పూన్ల మల్లె ఆకుల రసానికి 6 స్పూన్ల నువ్వుల నూనెను కలిపి బాగా మరిగించాలి. మల్లె ఆకు రసం ఇగిరిపోయి నువ్వుల నూనె మిగిలేవరకు మరిగించాలి.

ఇప్పుడు ఈ నూనెను చల్లారబెట్టాలి. సమస్య ఉన్న చెవిలో రెండు చుక్కలు మల్లె ఆకుల నూనెను వేస్తె చెవిలో చీము తగ్గటమే కాకుండా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే సరిపోతుంది. ఈ వేసవిలో ఎక్కువగా అందరిని బాధించే సమస్య నోటి పూత. ఈ సమస్య ఉన్నప్పుడు మల్లె ఆకు బాగా సహాయపడుతుంది.

నోటి పూత సమస్య ఉన్నప్పుడు ఉదయం పరగడుపున లేత మల్లె ఆకులను బాగా నమిలి నోటిని బాగా పుక్కిలించాలి. ఆ తరవాత వేప పుల్లతో పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తూ ఉంటే నోటి పుట సమస్య తగ్గిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News