White Kurma:చపాతీ, పూరి, పులావ్ లోకి ఎప్పుడు చేసే కర్రీ కాకుండా ఇలా వైట్ కుర్మా చేయండి.. సూపర్ గా ఉంటుంది
White Kurma: కర్నాటక ,తమిళనాడు, హోటల్స్ లో, ఎక్కువగా కనిపించే స్పెషల్ వైట్ సాగూ. కూరగాయ ముక్కలతో చేసుకునే, ఈ వైట్ కుర్మా, చపాతి, పూరీలో వాడుతుంటారు.
కావాల్సిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం..
బిర్యాని ఆకు – ½
లవంగాలు – 4
యాలకులు – 3
దాల్చిన చెక్క – 1 ఇంచ్
నాన పెట్టిన గసగసాలు – 1 టేబుల్ స్పూన్
నాన బెట్టిన జీడిపప్పులు – 15
పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం – 1 టీ స్పూన్
పచ్చి కొబ్బరి ముక్కలు – 1/4కప్పు
పచ్చి మిర్చి -5
కూరగాయలు ఉడికించడానికి..
క్నోల్ ఖోల్ ముక్కలు – 1/2కప్పు
ఆలు ముక్కలు – ½ కప్పు
బీన్స్ ముక్కలు-– 1/2కప్పు
క్యారేట్ – – 1/2కప్పు
నీళ్లు – 1 లీటర్
ఇప్పుడు సాగూ కోసం..
నూనె – 3 టేబుల్ స్పూన్స్
బిరియాని ఆకు – ½
సోంపు – 1 టీ స్పూన్
ఉల్లిపాయ – 1/2కప్పు
ఫ్రోజెన్ బఠానీ – 1/4కప్పు
ఉప్పు – తగినంత
కూరగాయలు ఉడికించిన నీళ్లు -1/2 లీటర్
మసాలా పేస్ట్ – తగినంత
పుదీనా ఆకులు – 7
పంచదార – 1/2టీస్పూన్
తయారీ విధానం
1.మిక్సీ జార్ లో మసాలా పేస్ట్ కోసం, తీసుకున్న పదార్ధాలన్ని వేసుకుని, కొద్దిగా నీళ్లు యాడ్ చేసి, మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని, నీళ్లు పోసి, కూరగాయ ముక్కలు అన్ని వేసి, 70 శాతం ఉడికించి తీసుకోవాలి.
3. ఇప్పుడు ఉడికించిన నీళ్లు పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి, నూనె వేడి చేసుకుని,అందులోకి, బిర్యానీ ఆకు, సోంపు, వేసి వేపుకోవాలి.
5. తర్వాత ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసుకుని, కలర్ ఛేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి.
6. వేగిన ఉల్లిలో, ఉడికిన కూరగాయ ముక్కలు, రెండు నుంచి మూడు నిముషాలు వేపుకోవాలి.
7. తర్వాత అందులోకి మసాలా పేస్ట్ వేసి, వేపుకోవాలి.
8. అందులోకి కురగాయలు ఉడకబెట్టిన నీళ్లు, పంచదార వేసి కలిపి మూత పెట్టుకొని, 15 నిముషాలు ఉడికించుకోవాలి.
9. చివరగా పుదీనా ఆకులు వేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News