Curry Leaves Benefits:పరగడుపున 4 పచ్చి కరివేపాకు ఆకులను నమిలి మింగితే.. ఆ సమస్యలకు చెక్
Curry Leaves Benefits:మనం ప్రతి రోజు వంటల్లో కరివేపాకు వేస్తూ ఉంటాం. కరివేపాకును కొంత మంది తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది.
అందువల్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కరివేపాకు వంటల్లోనే కాకుండా వివిద రకాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. కరివేపాకును స్వీట్ నీమ్ అని కూడా పిలుస్తారు. చాలా మంది కూరల్లో వేసే కరివేపాకును ఏరి పడేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పకుండా పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు కరివేపాకు వలన ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
జీర్ణశక్తిని పెంచటంలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించటంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకు జీర్ణశక్తిని పెంచి బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ మజ్జిగలో అర స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి బాగా కలిపి త్రాగితే బరువు తగ్గవచ్చు.
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొంచెం దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు .ఈ రోజుల్లో మధుమేహం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.
కరివేపాకులో యాంటీహైపర్ గ్లిసమిక్ సహజంగా ఉండుట వలన ప్రధానమైన రక్త నాళాల్లో గ్లోకోజ్ ను కంట్రోల్ చేస్తుంది.కాబట్టి ప్రతి రోజు ఉదయం పరగడుపున నాలుగు కరివేపాకులను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. గర్భధారణ సమయంలో ఉండే మార్నింగ్ సిక్ నెస్, వాంతులు, వికారం వంటి వాటికి కరివేపాకు ఉపశమనం కలిగిస్తుంది.
ఉదయం లేవగానే 4 కరివేపాకు ఆకులను తింటే ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన చర్మానికి కరివేపాకును రాయటం వలన మంచి రిజల్ట్ పొందవచ్చు. సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కరివేపాకును చేర్చుకుంటే కంటికి సంబందించిన సమస్యలను నివారించవచ్చు. కరివేపాకు పేస్ట్ కి కొంచెం పసుపు కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే స్కిన్ ఇరిటేషన్స్ తగ్గుతాయి. ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ కరివేపాకు పేస్ట్ వేసి బాగా కలిపి ఉదయం,సాయంత్రం త్రాగితే కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
అంతేకాక అనీమియా కూడా తగ్గుతుంది. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో ఐరన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే కరివేపాకును ప్రతి రోజు తీసుకుంటూ ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News