MoviesTollywood news in telugu

Guppedantha manassu:గుప్పెడంత మనస్సు సీరియల్ హీరోయిన్ గురించి నమ్మలేని నిజాలు

Guppedantha manassu:స్టార్ మా లో గుప్పెడంత మనసు సీరియల్ ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ ప్రేక్షక ఆదరణ పొంది సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న Vasudhara తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న అమ్మాయి. కృష్ణవేణి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది.

Vasudhara అసలు పేరు రక్షా గౌడ. బెంగళూరులో ఫిబ్రవరి 17న జన్మించిన ఈమె బెంగళూరు జైన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసింది. సక్సెస్ ఫుల్ మోడల్ కావాలని ఎన్నో కలలు కన్న రక్ష తన కెరీర్ ని మోడల్ గానే స్టార్ట్ చేసింది.

రాధారమణ కన్నడ సీరియల్ లో ఛాన్స్ రావడంతో ఆ సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మరో సీరియల్ కూడా చేసి, కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కృష్ణవేణి సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, టైటిల్ రోల్ పోషించి, తన అందంతో , నటనతో ఆకట్టుకుంది. ఇపుడు గుప్పెడంత మనసు సీరియల్ తో అలరిస్తుంది.