Kitchenvantalu

Chammakaya Pachadi:కొంత మందికి మాత్రమే తెలిసిన పచ్చడి.. పలు రకాల వ్యాధులు దూరం..

Chammakaya Pachadi: నోటికి రుచిగా లేకపోయినా ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని రెసిపీస్ ని మన మెనులో చేర్చుకోవాలి. అందులో చమ్మకాయ పచ్చడిని కూడ ట్రై చేయండి.చమ్మకాయలో కాల్షియం,ఐరన్,ఫైబర్ పుష్టిగా ఉండే చమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
చమ్మకాయలు – ½ kg
టమాటోలు – 2
పచ్చిమిర్చి – 7-8
కరివేపాకు – ¼ కప్పు
మెంతులు – ¼ టీ స్పూన్
జీలకర్ర -1 టీ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
చింతపండు – 10-15 గ్రాములు
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
తాలింపు కోసం..
నూనె 3 టేబుల్ స్పూన్స్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2-3
వెల్లుల్లి రెబ్బలు – 4-5
కరివేపాకు – ¼ కప్పు
నూనె – 3 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.చెమ్మకాయలను పీచు తొలగించి కొనలు కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.చమ్మకాయలను నీళ్లు యాడ్ చేసి ఉడకించి వడగట్టి పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి మెంతులు,జీలకర్ర, పచ్చిమిర్చి ,వేసి వేపుకోవాలి.
4.అందులోకి నువ్వులను కూడ యాడ్ చేసి వేపుకోని మిశ్రమాన్ని ప్లేట్ లోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.
5.అదే కడాయిలో నూనె వేడిచేసి అందులోకి ఉడకపెట్టుకున్న చమ్మకాయలను వేసి బాగా వేపుకోవాలి.

6.అందులోకి టమాటోలు,ఉప్పు వేసి మూతపెట్టి టమాటలు మెత్తపడే వరకు ఉడికించాలి.
7.ఇప్పుడు అందులోకి కరివేపాకు,చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.మిక్సి జార్ లోకి వేపుకున్న పచ్చిమిర్చి, నువ్వుల మిశ్రమం లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోని అందులోకి ఉడికించిన చమ్మకాయలను వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
9.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,వెల్లుల్లి తరుగు,కరివేపాకు వేసి వేగిన తాలింపులోకి గ్రైండ్ చేసుకున్న చమ్మకాయ పచ్చడిని కలుపుకోవాలి.
10. అంతే హెల్తీ అండ్ టేస్టీ చమ్మకాయ పచ్చడి రెడీ.