Kitchenvantalu

Semiya Bobbatlu:నోట్లో వెన్నలా కరిగిపోయే సేమ్యా బొబ్బట్లు రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు

Semiya Bobbatlu: బొబ్బట్లు పేరు వినగానే ఎవ్వరికైనా నోట్లో నీళ్లూరుతాయి బొబ్బట్లను సేమియాతో చేసి చూడండి కాస్తా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
సేమియా – 1 కప్పు
చక్కెర – ¾ కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
ఉప్పు – కొద్దిగా
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 5
బాదం – 5
యాలకులు – 2-3

తయారీ విధానం
1.గోధుమ పిండిని బౌల్ వేసి ఉప్పు యాడ్ చేసి కలుపుకోవాలి.
2. రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోని కొద్దిగా కొద్దిగా నీళ్లు వేస్తు పిండిని ముద్దలా కలుపుకోవాలి.
3.చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకోని పిండిని బాగా కలుపుకోని గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టఫ్పింగ్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేసుకోని సేమియా వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
5.వేపుకున్న సేమియాను ప్టేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
6.అదే ప్యాన్ లోకి రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి.
7.ఎసరు మరుగుతున్నప్పుడు వేపుకున్న సేమియాను వేసి నీళ్లు ఆవిరి అయ్యే వరకు ఉడికించాలి.

8.ఇప్పుడు అందులోకి చక్కెర వేసి దగ్గరపడే వరకు కలుపుకోవాలి.
9.ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసుకున్న బాదం,కాజు పొడి,యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
10.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోని చల్లారనివ్వాలి.
11.చల్లారిన మిశ్రమాన్ని చిన్న బాల్స్ లా చేసుకోవాలి.
12.ఇప్పుడు నానిన గోధుమపిండిని ముద్దలుగా చేసుకోని చపాతిలా వత్తుకోవాలి.
13.అందులోకి రెడీ చేసుకున్న స్టప్ ని పెట్టుకోని పిండితో కవర్ చేసి బాల్స్ లా చేసుకోని పూరి షేప్ లో నెమ్మదిగా తాల్చుకోవాలి.
14.తయారు చేసుకున్న బొబ్బట్లను పెనం పై వేసి నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చుకుంటే సేమియా బొబ్బట్లు రెడీ.