Kitchenvantalu

Biyyam Pindi Rotti Recipe:ఇలా రొట్టి చేసుకోని తింటే రుచిని మరిచిపోలేరు.. సూపర్ గా ఉంటుంది..

Biyyam Pindi Rotti Recipe:మసాలా రోటి.. బియ్యం పిండి ఇంట్లో ఉంటే చాలు .ఎన్నో వెరైటీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. కొంచెం కారం కారం గా కరకరలాడే రోటి ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 ½ కప్పు
జీలకర్ర – 1 స్పూన్
నువ్వులు – 2 స్పూన్
పసుపు – ¼ స్పూన్
ఉప్పు – ½ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
క్యారేట్ తురుము – ½ కప్పు
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు
పచ్చిమిర్చి – రుచికి సరిపడా

తయారీ విధానం
1.మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండిని వేసి అందులోకి జీలకర్ర,నువ్వులు,పసుపు,కారం,ఉప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్,తురిమిన క్యారేట్ ,పచ్చిమిర్చి ,కరివేపాకు,నూనే వేసి కలుపుకోవాలి.
2.కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తు పిండిని మెత్తగా కలుపుకోవాలి.
3.ఇప్పుడు రోటి చేసుకోవడం కోసం ,అల్యూమినియం ఫాయిల్ గాని అరటి ఆకు పై గాని వత్తుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకోని వేడిక్కాక వత్తుకున్న రొటీలు వేసి కొద్దిగా నూనే వేస్తు రెండు వైపులా కాల్చుకోవాలి.
5.అంతే వేడి వేడి స్నాక్స్ మసాలా రోటి రెడీ.