Kitchenvantalu

Clothes Color:కొత్త దుస్తులు ఉతికినప్పుడు రంగు పోకుండా ఉండాలంటే…ఉతికేటప్పుడు ఇలా చేస్తే చాలు

Clothes Color: మనకు నచ్చిన దుస్తులను ఎంత ఖర్చు పెట్టి అయినా కొంటూ ఉంటాం. అలా కొన్న బట్టలు ఒకసారి ఉతికేసరికి రంగు పోతే చాలా బాధేస్తుంది. అదే సరిగ్గా ఉతికితే బాగుండేది కదా అనిపిస్తుంది. దుస్తులను ఉతికినప్పుడు రంగు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అవ్వండి.

ఒక బకెట్ నీళ్లలో ఒక చిన్న పట్టిక ముక్క, 5 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో దుస్తులను కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిలోంచి దుస్తులను ఒక్కొక్కటిగా తీసి శుభ్రమైన నీటిలో నానబెట్టి ఉతకాలి. ఈ విధంగా చేయటం వల్ల కొత్త దుస్తులు రంగు పోకుండా ఉంటాయి.

ఈ ప్రక్రియ చేయటం వలన బట్టలు కొంచెం పెళుసుగా మారతాయి. బట్టలు మృదువుగా ఉండాలంటే ఒక బకెట్లో వెనిగర్ వేసి ఆ నీటిలో దుస్తులను అరగంట పాటు నానబెట్టి తీసి అరబెడితే పెళుసు పోయి మృదువుగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.