Kitchenvantalu

Sweet Poori Recipe:మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పువ్వులాంటి స్వీట్ పూరీలు

Sweet Poori Recipe:స్వీట్ పూరీ.. పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ పూరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి. ఇంట్లో ఉండే పదార్ధాలతో చిటికెలో తయారు చేసుకునే స్వీట్ పూరి చాలా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
మైదా – 1 కప్పు
చక్కెర – 1 కప్పు
ఉప్పు – చిటికెడు
బేకింగ్ సోడా – చిటికెడు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

తయారీ విధానం
1.ఒక గిన్నెలోకి గోధుమ పిండి,మైదా పిండిని తీసుకోని అందులోకి ఉప్పు ,బేకింగ్ సోడా రెండు టీ స్పూన్స్ నూనెవేసి బాగా కలుపుకోవాలి.
2.కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తు పిండిని మెత్తగా కలుపుకోని పదిహేను నుంచి ఇరువై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
3.అరచేతుల పై నూనె రాసుకోని పిండిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి.
4.మూడు సైజులలో పూరీలను తాల్చుకోవాలి.
5.పెద్ద సైజు పూరీ పై నీటిని వేసి చిన్న సైజ్ పూరిలను అతికించుకోవాలి.

6.మూడింటిని కలిపి తిప్పు కోని పువ్వు ఆకారంలో సిధ్దం చేసుకోవాలి.
7.డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసి తయారు చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి.
8.ఇప్పుడు షుగర్ సిరప్ కోసం కప్పు చక్కెర ,గ్లాస్ నీళ్లను తీసుకోని తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి.
9.పాకం తయారైతున్నప్పుడు అందులోకి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
10.స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్న పూరీలను పాకంలో వేయాలి.
11.పూరిలకు పూర్తిగా చక్కెర స్ప్రెడ్ అవ్వనివ్వాలి.
12.చల్లారక ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకుంటే పది ,పదిహేను రోజులు ఫ్రెష్ గా ఉంటాయి..