Healthhealth tips in telugu

Chia seeds for diabetics:షుగర్ ఉన్నవారు చియా సీడ్స్ తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా?

Chia Seeds Good for Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు చియా సీడ్స్ తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. ఒకప్పుడు చియా సీడ్స్ చాలా అరుదుగా లభించేవి. కానీ ప్రస్తుతం చాలా విరివిగా లభిస్తున్నాయి.

అంతేకాకుండా మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చియా సీడ్స్ లో ఉన్న ప్రయోజనాల కారణంగా తీసుకోవటం ప్రారంభించారు. చియా సీడ్స్ లో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారిలో అధిక బరువు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి చియా సీడ్స్ బాగా సహాయపడతాయి.

చియా సీడ్స్ తీసుకోవటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరిక కూడా ఉండదు. దాంతో బరువు తగ్గుతారు. ఈ గింజలు గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

చియా విత్తనాలు గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ టాలరెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చియా సీడ్స్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటుంది. అలా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చియా సీడ్స్ సహాయపడతాయి.

అలాగే చియా విత్తనాలలో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడతాయి. ఒక గ్లాస్ నీటిలో పావుస్పూన్ చియా సీడ్స్ వేసి మూడు గంటలు నానబెడితే గింజలు బాగా ఉబ్బి జెల్లీలా మారతాయి. వీటిని సలాడ్స్, మజ్జిగ వంటి వాటిలో కలుపుకొని తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.