Healthhealth tips in telugu

Food for kidneys:కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాలను తింటే ఏమి అవుతుందో తెలుసా?

Foods For Kidney : రక్తం నుండి వ్యర్ధాలను బయటకు పంపే సామర్ధ్యం కిడ్నీలకు తగ్గినప్పుడు కిడ్నీకి సంబందించిన సమస్యలు వస్తాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొంతమేర సమస్య నుంచి బయట పడవచ్చు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు క్యాబేజీ తింటే క్యాబేజీలో ఉండే పొటాషియం, ఫాస్పరస్ సమృద్దిగా మరియు సోడియం తక్కువగా ఉండటం వలన కిడ్నీ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. క్యాబేజీ లో విటమిన్స్, మినరల్స్, పవర్‌ఫుల్ ప్లాంట్ కాంపౌండ్స్‌,విటమిన్ కె, విటమిన్ సి, బి సమృద్దిగా ఉంటాయి. అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచి ప్రేగు కదలికలు బాగుండేలా చేస్తుంది.

కాలీఫ్లవర్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, బి విటమిన్, ఫోలెట్ వంటివి సమృద్దిగా ఉండుట వలన శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపుతాయి. కాలీఫ్లవర్ ని ఉడికించి తినవచ్చు. దీనిలో సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగాను ఉంటాయి.

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోమని నిపుణులు చెప్పుతు ఉంటారు. వెల్లుల్లిలో కూడా సోడియం తక్కువగాను పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. కూరలకు మంచి రుచిని అందిస్తుంది. అలాగే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. రెండు రెబ్బల వెల్లుల్లిని ఉడికించి తీసుకోవచ్చు. లేదా కూరల్లో వేసుకొని తినవచ్చు. రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తినెలా చూసుకోవాలి.

గుడ్డులోని తెల్లసొన తింటే కిడ్నీలకు అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇది డయాలసిస్ చికిత్స చేయించుకున్న వ్యక్తులకు కూడా చాలా మంచిది.
గుడ్లని ఆమ్లెట్స్, శాండ్‌విచ్‌ల కోసం తెల్లసొనని వాడండి. గుడ్లని బాగా ఉడికించి ట్యూనా, గ్రీన్‌ సలాడ్స్‌లో కలిపి తినండి. ఇలాంటి ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.