Healthhealth tips in telugu

winter Care Tea:చలికాలంలో ఈ “టీ”లో వీటిని కలిపి తాగితే ఊహించని ప్రయోజనాలు…

Monsoon Tea : మనలో చాలామంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అలాగే ఈ వానాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా టీ తాగాలని అనిపిస్తుంది. నార్మల్ టీ కాకుండా కాస్త బిన్నంగా తయారు చేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ సీజన్లో దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి.

వాటిని తగ్గించుకోవడానికి అలాగే అవి రాకుండా ఉండాలన్న ప్రతిరోజు తయారు చేసుకునే టీలో కొన్ని రకాల మూలికలను కలిపితే సరిపోతుంది. ఇవి మన ఇంటిలో సులభంగా దొరికేవే. వీటిని టీలో కలిపి తీసుకుంటే ఈ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కాస్త ఓపికగా ఇటువంటి చిట్కాలను పాటిస్తే మన ఆరోగ్యానికి మంచిది.

టీ లో చిటికెడు పసుపు కలిపి తాగితే మంచిది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలోని మలినాలను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి దగ్గు, జలుబు వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది.

టీ లో తులసి వేసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒక కప్పు టీ కి నాలుగు లేదా ఐదు తులసి ఆకులను వేస్తే సరిపోతుంది.

అల్లంతో టీని చాలామంది తయారు చేసుకుంటారు. అల్లం దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించడమే కాకుండా ఈ సీజన్లో సాధారణంగా వచ్చే అజీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని .పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అల్లం లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆకలిని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.