Kitchenvantalu

Baby Potato Manchurian: ఎంతో స్పైసీగా ఉండే బేబీ పొటాటో మంచూరియన్.. ఇంటిలోనే చాలా సులభంగా..

Baby Potato Manchurian:బేబి పొటాటో మంచురీయన్.. పిల్లలకి స్నాక్స్ అంటే వెరైటీ గా ఉంటే తప్ప దాని వంక చూడరు. టేస్ట్ ఎలా ఉన్నా ముందుగా కాస్తా స్పెషల్ లుక్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేస్తారు. బేబి పోటాటోస్ తో మంచురీయా తయారు చేసి చూడండి.వెరైటీగాను ,టేస్టీగాను ఉంటాయి.

కావాల్సిన పదార్ధాలు
బేబి పొటాటోస్ – 300 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
కారం – ½ టీ స్పూన్
పెప్పర్ పొడి – ¼ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 5-6
పచ్చిమిర్చి- 1
ఉల్లిపాయ – 1
సోయా సాస్ – 1 టీ స్పూన్
వెనిగర్ – ½ టీ స్పూన్
టొమాటో సాస్ – 1 టీ స్పూన్
కొత్తమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా బేబి పొటాటోస్ ని ప్రెజర్ కుక్కర్లో వేసి ఉప్పు యాడ్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
2.ఉడికిన దుంపలను ఫోర్క్ తో కోతలు పెట్టాలి.
3.ఇప్పుడు బ్యాటర్ కోసం మిక్సింగ్ బౌల్ లోకి కార్న్ ఫ్లోర్ ,ఉప్పు,కారం,చిటికెడు మిరియాల పొడి,వేసి కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండని పొటాటో దుంపలపై చల్లుకోని మిక్స్ చేసుకోవాలి.
5.దుంపలకు పిండి పట్టుకునేలా టాస్ చేసుకోవాలి.

6.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం లేదా ప్యాన్ షాలో ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి పొటాటోస్ వేపి పక్కన పెట్టుకోవాలి.
7.బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న పొటాటోస్ ని పక్కన పెట్టుకోవాలి.
8.ఇప్పుడు గ్రేవి కోసం బాండీలో ఆయిల్ వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు,ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
9.వేరొక గిన్నెలోకి 1 ½ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి అందులోకి కారం,ఉప్పువేసి,నీళ్లతో కలుపుకోవాలి.
10.ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో టోమాటో సాస్ లు ,కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
11.గ్రేవిలోకి కొద్దిగా నీళ్లను కూడ యాడ్ చేసుకోవచ్చు.
12.రెడీ అయినా గ్రేవీలోకి కొత్తిమీర తరుగు,ప్రై చేసుకున్న పొటాటోస్ వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే..