MoviesTollywood news in telugu

Tollywood:రెండు జనరేషన్ హీరోలతో నటించిన హీరోయిన్లు

Tollywood News:సాదారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువకాలం సినీ పరిశ్రమలో ఉండటం కష్టమే. హీరోయిన్ గా కొంత కాలం నటించాక అక్క,చెల్లి,వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే కొంతమంది హీరోయిన్స్ రెండు జనరేషన్ హీరోలతో నటించారు. ఇప్పుడు వారి వివరాలు తెలుసుకుందాం. 

1. శ్రీదేవి,అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున 
శ్రీదేవి,అక్కినేని నాగేశ్వరరావు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు నాగార్జునతో కలిసి ‘గోవిందా గోవిందా’, ‘ఆఖరి పోరాటం’ సినిమాల్లో నటించింది. 

2. నయనతార,వెంకటేష్,రానా 
నయనతార వెంకటేష్ తో కలిసి లక్ష్మి,తులసి వంటి సినిమాలు చేసింది. రానాతో కలిసి ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో నటించింది. 
3. సమంతా,పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ 
సమంతా పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’సినిమాలో నటించింది. ఇక అల్లు అర్జున్ టి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది. 

4. నయనతార, బాలకృష్ణ,ఎన్టీఆర్ 
నయనతార బాలకృష్ణ తో సింహ,శ్రీ రామరాజ్యం సినిమాల్లో జోడి కట్టింది. ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ లో నటించింది.

5. శ్రియ, బాలకృష్ణ,ఎన్టీఆర్ 
శ్రియ బాలకృష్ణ తో చెన్న కేసవరెడ్డి సినిమాలో నటించింది. అలాగే అబ్బాయితో ‘నా అల్లుడు’ సినిమాలో నటించింది. 

6. త్రిష,బాలకృష్ణ,ఎన్టీఆర్ 
త్రిష,బాలకృష్ణ తో కలిసి ‘లయన్’సినిమాలో నటించింది. ఇక అబ్బాయి ఎన్టీఆర్ తో కలిసి ‘దమ్ము’ సినిమాలో నటించింది. 7.

7.శృతి హసన్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ 
శృతి హసన్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది. ఇక అబ్బాయితో ‘ఎవడు’ సినిమాలో నటించింది. 

8. కాజల్,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ 
కాజల్ పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది. అదే అబ్బాయితో మగధీర సినిమాలో జోడి కట్టింది. 

9. తమన్నా,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ 
తమన్నా పవర్ స్టార్ తో ‘కెమెరా మాన్ గంగతో రాంబాబు’ సినిమాలో నటించింది. అదే అబ్బాయితో ‘రచ్చ’ సినిమాలో జోడి కట్టింది. 

10. అనుష్క,వెంకటేష్,రానా 
అనుష్క వెంకటేష్ తో ‘చింతకాయల రవి’ సినిమలో నటించింది. అదే అబ్బాయితో ‘రుద్రమదేవి’ సినిమాలో నటించింది.