Healthhealth tips in telugu

Turmeric In Food:ఈ సమస్యలు ఉన్నవారు ఆహారంలో పసుపు వాడితే..!

Turmeric Side Effects In Telugu : పసుపును మనం రెగ్యులర్ గా వంటలలో వాడుతూ ఉంటాం. పసుపును ఎక్కువగా వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
weight loss tips in telugu
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. పసుపును ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి ఎక్కువగా వాడితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. పసుపును ఎక్కువగా వాడితే మంచిది కాదని మనలో చాలా మందికి తెలియదు. పసుపును రోజులో పావు స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
pasupu benefits
వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసి తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని మనలో చాలా మంది తాగుతూ ఉంటారు. అలాగే సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి వాటిని తగ్గిస్తుందని నమ్మకం. అలాగే పసుపును కొలెస్ట్రాల్, కాలేయ వ్యాధి, చర్మంపై దద్దుర్లు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.

అలాగే ఇది వాపును తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుందని ఎక్కువగా పసుపును వాడుతూ ఉంటారు. పిత్తాశయం సమస్యలు,కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపును వాడకూడదు. ఒకవేళ వాడితే ఆ ప్రభావం మొత్తం శరీర ఆరోగ్యం మీద పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు మందులు వాడుతూ ఉన్నప్పుడు పసుపును చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.
Diabetes diet in telugu
ఎందుకంటే పసుపులో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి.గ్యాస్ సమస్యలు ఉన్నవారు కూడా పసుపును ఎక్కువగా వాడితే సమస్య తీవ్రతరం కావచ్చు. పసుపు శరీరం యొక్క ఐరన్ శోషణ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడినప్పుడు ఐరన్ టాబ్లెట్స్ వేసుకొనేవారు పసుపుకు దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/