Health Tips:ప్రతి రోజు అరస్పూన్ పొడి తీసుకుంటే జీవితంలో డాక్టర్ అవసరమే ఉండదు…నిజం ఎంత…?
Triphala Churnam Health Benefits In telugu : ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన ఈ త్రిఫల చూర్ణం వాత,పిత్త,కఫ సమస్యలకు దివ్యఔషదంగా చెప్పవచ్చు. ప్రతిరోజు త్రిఫల చూర్ణం తీసుకుంటే డాక్టర్ తో అవసరం ఉండదని ఆయుర్వేద నిపుణులు చెప్పుతున్నారు.
సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి ఉంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ త్రిఫల చూర్ణంని వేసి కరిగించి ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు త్రాగాలి. భోజనం చేయటానికి ముందు 30 నుంచి 60 నిమిషాల ముందే త్రాగాలి. ఇలా తాగటం వలన శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఎర్రరక్త కణాలను పెంచుతుంది.
గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా ఆకలి లేనివారిలో ఆకలి పుట్టేలా చేస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను బయటకు పంపుతుంది. కాలేయానికి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఊపిరితిత్తులలో తేమ మరియు శ్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడి, శ్వాసకోశ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
కండరాల స్థాయిని కాపాడటమే కాకుండా, సన్నమైన కండరాల యొక్క బరువుని పెంచి దృడంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.