Kitchenvantalu

Egg Rolls:పిల్లలు ఇష్టపడే ఎగ్ రోల్స్ ఈజీగా ఇంట్లోనే.. ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిపోతుంది

Egg Rolls:ఎగ్ రోల్స్..పిల్లల కోసం వెరైటీ స్నాక్స్ తయారు చేయాలనకుంటే ఎగ్ రోల్స్ చేసి చూడండి. టేస్ట్ తో పాటుగా పోషకాలు కూడ అందుతాయి.బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ లోకి ఈ రోల్స్ చేసి పెట్టారంటే మిగిల్చకుండా తినేస్తారు.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
గుడ్లు – 2
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 3
క్యారెట్ మొక్కలు – ½ కప్పు
క్యాబేజీ – ½ కప్పు
క్యాప్సికం – ½ కప్పు
ఉప్పు – ½ టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా చపాతిల కోసం గిన్నెలోకి గోధుమ పిండిలోకి చిటికెడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసి పిండిని కలుపుకోవాలి.
2.కలుపుకున్న పిండిని పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు మగ్గాక క్యారేట్ ,క్యాప్సికం ముక్కలను వేసి ఉడికించుకోవాలి.
5.ఉప్పు,మిరియాల పొడి వేసి కూరగాయలు మెత్తపడే వరకు వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

6.ఇప్పుడు వేరొక గిన్నెలో గుడ్లను కొట్టి అందులోకి చిటికెడు ఉప్పు,మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి.
7.ఇప్పుడు చపాతిలు చేసుకోని వేడిచేసిన ప్యాన్ పై వేసుకోవాలి.
8.చపాతి కాస్తా వేగానివ్వాలి.
9. గుడ్డు మిశ్రమాన్ని వేరొక ప్యాన్ లో వేసి స్ప్రెడ్ చేసుకోని దాని పై వెజిటెబుల్ స్టఫింగ్ వేసి పైనా చపాతిని వేసుకోవాలి.
10.ఒక నిమిషం పాటు వేగాక చపాతిని తిప్పుకోని రోల్ చేసుకోవాలి.
11.అంతే ఎగ్ రోల్స్ రెడీ.