Jaggery with curd:పెరుగులో బెల్లం కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా..
Curd and jaggery Benefits In telugu : ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి బెల్లం, పెరుగు బాగా సహాయ పడతాయి. బెల్లం, పెరుగు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
దీనిని కేవలం మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల దంతాలు ఎముకలు బలంగా మారుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నప్పుడు పెరుగులో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే నిమిషంలోనే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది, ఆకలిని తగ్గించడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువైపోయింది. పెరుగులో బెల్లం కలిపి తింటే శరీరానికి అవసరమైన ఐరన్. అంది రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తి చేయటానికి సహాయపడుతుంది.
శారీరక బలహీనత తగ్గిస్తుంది. అలసట నీరసం నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. జలుబు సమస్యతో బాధపడేవారు పెరుగులో బెల్లంతో పాటు కాస్త మిరియాలపొడి వేసుకుని తింటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని పెరుగు, బెల్లం తినటానికి ప్రయత్నం చేయండి. అయితే ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.