Kitchenvantalu

Pudina Rice:కేవలం 10 నిమిషాల్లో పుదీనా రైస్ ఇలా చేసి రుచి చూడండి.. భలే ఉంటుంది కమ్మగా..

Pudina Rice:పుదీనా రైస్.. చూడటానికి అట్రాక్టివ్ గా ,కమ్మటి సువాసనతో కూడిన పూదీనా రైస్ లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల అరుగుదల ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.

కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం – 3 కప్పులు
పుదీనా – 1 ½ కప్పు
పచ్చిమిర్చి – 6
వెల్లుల్లి రెబ్బలు – 7-8
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
దాల్చిన చెక్క- 4-5
లవంగాలు – 4-5
యాలకులు – 3
జీడిపప్పు – 10
ఎండుమిర్చి – 4
కరివేపాకు – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి కప్పు పుదీనా .పచ్చిమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యిని వేడి చేసి అందులోకి దాల్చిన చెక్క,యాలకులు,లవంగాలు,జీడిపప్పులు వేసి వేపుకోవాలి.
3.ఎండుమిర్చి,కరివేపాకు,కొత్తిమీర ,గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
4.అందులోకి పసుపు,ఉప్పు,వేసి ఉడికించిన అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5.చివరగా కొత్తిమీర తరుగు చల్లుకోని సర్వ్ చేసుకుంటే పుదీనా రైస్ రెడీ.