Kitchenvantalu

Peanut Chikki:పల్లీ పట్టీ పంటికి అంటకుండా బయట కొన్నట్టు రావాలంటే ఇవే పర్ఫెక్ట్ టిప్స్..

Peanut Chikki:వేరుశనగ చిక్కిలు.. పుష్కలంగా ఐరన్ అందించే పల్లీ పట్టీలు రోజుకు ఒకటైనా తింటే పిల్లలు బలంగా తయారౌతారు. షాప్స్ లో దొరికేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పల్లీలు – 1 కప్పు
బెల్లం – 3-4 కప్పు

తయారీ విధానం
1.ముందుగా వేరుశనగలను దోరగా వేపుకోవాలి.
2.వేపుకున్న పల్లీలను పూర్తీగా చల్లారనివ్వాలి.
3.చల్లారిన పల్లీలను వేరోక గిన్నెతో వత్తుకుంటు పలుకులుగా మార్చుకోవాలి.
4.ఊడిన పొట్టును తొలగించి పల్లీల చూర్ణం పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు పాకం కోసం ¾ కప్పు బెల్లం కోసం ½ కప్పు నీళ్లను వేసి లోఫ్లేమ్ పై కరిగించుకోవాలి.

6.గిన్నెలో నీళ్లను పోసి పాకాన్ని తీగ పాకం వచ్చే వరకు గుర్తించాలి.
7.పాకం తయారైన తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగ పలుకులను వేసి కలపుకోవాలి.
8.వెడల్పాటి ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి కలుపుకున్న బెల్లం మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి.
9.కాస్తా గోరువెచ్చగా అయిన తర్వాత నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి.
10.పూర్తీగా చల్లారక చిక్కిలు మరింత గట్టి పడ్తాయి.
11.అంతే వేరు శనగ చిక్కిలు రెడీ.