Healthhealth tips in telugu

Health Tips:ఈ సీజన్ లో ఈ పండును తినకపోతే.. మీరు ఎన్ని ప్రయోజనాలను మిస్ అవుతారో తెలుసా…

Albakara fruit Benifits In Telugu: ఎర్రగా నిగనిగలాడుతూ పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. ఆల్‌బకర పండ్లను చూడగానే నోరూరుతుంది. సాధారణంగా ఏదైనా పండు తిన్నా వెంటనే రక్తంలో సుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ ఈ ఆల్  బకరా పండుతో అటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్ బకరాలో గైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.

అంతేకాక కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండులో తక్కువ కొవ్వు,అధిక ఫైబర్, విటమిన్లు ఎ మరియు సి, విటమిన్ డి, బి 6, బి 12 మరియు అధిక పొటాషియం, మెగ్నీషియం,కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ ఉన్నాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
Acidity home remedies
ఈ పండ్లలో ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో వాపు తగ్గేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా కణాలు దెబ్బతినకుండా చూడటమే కాకుండా రిపేర్ కూడా చేస్తాయి. ఆల్‌బ‌క‌రా పండ్ల‌లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి ఎటువంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది.

విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలురాకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పొటాషియం రక్తపోటుని కంట్రోల్ గా ఉండేలా చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడటమే కాకుండా జ్ఞాపకశక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఆల్ బకరా పండును తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఆకలి తొందరగా వేయదు. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఆల్ బకరా పండ్లు క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడతాయి.

ముఖ్యంగా రొమ్ము, జీర్ణశయాంతర మరియు శ్వాసకోశ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. అల బకరాలో ఉండే  ఆంథోసైనిన్స్  ఫ్రీ రాడికల్స్‌ మీద పోరాటం చేయటం ద్వారా క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి. ఆల్ బకరాలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ నోటి మరియు కేవిటి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.
Joint pains in telugu
రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆల్ బకరా పండ్ల  యొక్క యాంటీఆక్సిడెంట్ శక్తి మరియు  ఫైటో న్యూట్రియెంట్స్ రొమ్ము క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిలిపివేస్తాయి కాని ఆరోగ్యకరమైన కణాలను చంపవు.ఆల్ బకరా పండ్లు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా మోనో పాజ్ దశలో ఉన్న మహిళలో ఎముకలు బలహీనపడతాయి. అలాంటి వారికీ ఆల్ బకరా పండు ఎముకల బలహీనత రాకుండా కాపాడుతుంది. ఈ పండు డ్రై రూపంలో కూడా లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.