Healthhealth tips in telugu

Mango Flower:ఈ పువ్వును నీటిలో నానబెట్టి తీసుకుంటే డయాబెటిస్,చెడు కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు

Mango Flower benefits In Telugu : డయాబెటిస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలాగే డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. మనలో చాలా మందికి డయాబెటిస్ నియంత్రణలో మామిడి ఆకులు సహాయపడతాయని తెలుసు. అలాగే మామిడి పువ్వు కూడా సహాయపడుతుంది.
Diabetes In Telugu
మామిడి పువ్వు దొరికినప్పుడు ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. తాజా పువ్వు దొరికినప్పుడు తాజా పువ్వును వాడుకోవచ్చు. తాజా పూలను కోసి రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎండిన పువ్వులను పొడిగా చేసి కూడా వాడవచ్చు.

ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ పొడి వేసి మరిగించి వడగట్టి తాగాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తూ ఉంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
cholesterol
వేసవిలో వేడి కారణంగా నోటి పూత ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోటి పూతను తగ్గించటానికి కూడా మామిడి పూత బాగా సహాయపడుతుంది.
పంటి నొప్పితో, చిగుళ్ల వాపు,నోటి పూత సమస్యతో బాధపడేవారు నీటిలో మామిడి పూతను వేసి మరిగించి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
Best home remedy for Mouth Ulcers in Telugu
ఎండబెట్టిన మామిడి పువ్వులను బాగా పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకుంటే నోటిపూత తగ్గుతుంది. మామిడి పూత సీజన్ లో దొరికినప్పుడు ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. మామిడి పూత దొరికినప్పుడు తాజా పూతను వాడవచ్చు. కాబట్టి ఈ మామిడి పూతను వాడి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.